'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' జనసేనకు జై కొట్టింది

సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేన లో చేరబోతున్నారు. ఈ మధ్యే వైసీపీకి దూరమైన ఆయన ఈ రోజు జనసేన నేత నాగబాబును కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

Advertisement
Update:2022-08-06 15:59 IST

'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' జనసేనకు జై కొట్టింది. పొలిటికల్ కెరీర్ కి దూరమై.. మళ్ళీ అందులో చేరితే అదో మజా ! ఇప్పుడు సినీ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ ఇదే పంథా ఎంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేత నాగబాబును కలిసి.. జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తరఫున ప్రచారం చేసి.. ఆ తరువాత ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా వ్యవహరించిన పృథ్వి .. పొలిటికల్ కెరీర్ మసక బారింది. ఓ మహిళతో ఆయన సాగించినట్టు చెబుతున్న రాసలీలల తాలూకు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై వేటు పడింది. ఈ పదవి నుంచి తనను ప్రభుత్వం తీసివేయడంతో ఇదంతా .. తన ఎదుగుదల చూసి తన సొంత పార్టీవారే ఈ ఫేక్ వీడియో సర్క్యులేట్ చేశారని వాపోయారు. అంతవరకు టీడీపీని, జనసేనను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన పృథ్వి .. సైలెంట్ అయిపోయారు. బహుశా చేసిన తప్పు తెలుసుకుని మారిపోయినట్టు కనిపించింది.

ముఖ్యంగా జనసేన నేతకు రాజకీయంగా క్షమాపణ చెబుతున్నానంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రజలకోసం కష్టపడి పని చేసే నేత అని, ప్రజలు ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నారని.. ఇలా పూర్తి పక్కా జనసేన కార్యకర్తగా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో జనసేనకు 40 సీట్లు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో పవన్ కింగ్ అవుతారని జోస్యం చెప్పారు. నెలరోజుల క్రితమే పృథ్వి .. పవన్ పార్టీలో చేరవచ్చన్న ప్రచారం జరిగింది. ఇక ఆయన జనసేన కండువా కప్పుకోవడం లాంఛనమే..

వైసీపీ పైన, జగన్ పాలన పైన నిప్పులు కక్కుతున్న జనసేనాని ఈ మాజీ వైసీపీ నేతను పార్టీలోకి చేర్చుకోవడం వింత పరిణామమే.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనుకోవడానికి ఇంతకన్నా నిదర్శనం మరేముంటుంది?





Tags:    
Advertisement

Similar News