బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు.. తర్వాత గోరంట్ల సహా 23 మందికి..!

తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్దా వెంకన్నకు సీఐడీ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బుద్దాకు శుక్రవారం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.

Advertisement
Update:2023-11-04 12:34 IST

బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు.. తర్వాత గోరంట్ల సహా 23 మందికి..!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. బాబుకు జ్యుడీషియ‌ల్‌ రిమాండ్‌ విధించిన న్యాయమూర్తిపై పలువురు టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, అలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్దా వెంకన్నకు సీఐడీ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బుద్దాకు శుక్రవారం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిపి మొత్తం 23 మంది సోషల్‌ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు సీఐడీ గుర్తించింది. వారందరినీ విచారణ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది.

ఇదే క్రమంలో బుచ్చయ్య చౌదరికి కూడా ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు.. నిందితులతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ (ఎక్స్‌), గూగుల్‌ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని సీఐడీ హైకోర్టుకు తెలపడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News