సీఐడీ సునీల్ కుమార్ బదిలీ
జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా సునీల్ కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ చీఫ్‌గా విపత్తు నిర్వాహణ డీజీ సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ చీఫ్‌గా విపత్తు నిర్వాహణ డీజీ సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది.
సీఐడీ చీఫ్‌గా సునీల్ కుమార్ ప్రశంసలు, విమర్శలు భారీగానే అందుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని భారీ స్థాయిలో అరెస్ట్ చేయడం సునీల్ కుమార్ హయాంలోనే జరిగింది. ఆయన ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తూ వచ్చింది.
రఘరామకృష్ణంరాజు ఎపిసోడ్‌ను సునీల్ కుమార్ పర్సనల్‌గా తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సునీల్ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు కూడా చేశారు. నెల క్రితమే సునీల్ కుమార్‌కు ప్రభుత్వం డీజీగా పదోన్నతి ఇచ్చింది.
ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్‌చార్జ్ డీజీపీగా మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఫైల్ పంపలేదు. ఒకవేళ డీజీపీగా సునీల్ కుమార్‌ను నియమిస్తారేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇది సాధారణ బదిలీనే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.