కాల్వలతో చెరువుల అనుసంధానం.. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌‌పై సమీక్షలో జగన్..

అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ పనులను చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Update:2022-09-09 20:47 IST

రాష్ట్రంలో చేపడుతున్న ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రూ.25,497.28 కోట్లతో చేపట్టబోతున్న ఈ ఏపీ ప్రాజెక్టుల స్థితిగతులపై తాడేప‌ల్లిలోని త‌న కార్యాల‌యంలో సమీక్ష చేప‌ట్టారు. న్యూడెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసీయన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

చెరువుల పరిస్థితి ఏంటి?

రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ప్రస్తుతం ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలి అని సూచించారు. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలంటూ కీలక ఆదేశాలిచ్చారు. దీంతో చెరువు కింద ఉన్న భూములసాగు జరుగుతుందన్నారు.

పోర్టుల ఆధారితంగా అభివృద్ధి

అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ పనులను చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు నిర్మించబోతున్నాం అని సీఎం జగన్ సమీక్షలో వెల్లడించారు.

ఈ పోర్టుల నిర్మాణం ఫలితంగా వీటిచుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు అత్యధికంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ డా. సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి. సృజన, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి. రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News