బెడిసికొట్టిన చంద్రబాబు ఫస్ట్ ప్లాన్.. ఇక లాస్ట్ ఛాన్స్ అదే..!

శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించేందుకు సావ‌నీర్ క‌మిటీ చైర్మ‌న్ టీడీ జ‌నార్ద‌న్‌, నంద‌మూరి రామ‌కృష్ణ మాత్రమే వెళ్లారు. ఒకవేళ ఆ నంద‌మూరి రామ‌కృష్ణ ప్లేస్‌లో నందమూరి బాలకృష్ణ వెళ్లుంటే..? జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పేవాడా..?

Advertisement
Update:2023-05-16 14:02 IST

జూనియర్ ఎన్టీఆర్‌ విషయంలో నారా చంద్రబాబు నాయుడి ఫస్ట్ ప్లాన్ బెడిసికొట్టింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రావాలని అధికారికంగా ఆహ్వానం అందినా.. తాను రాలేనని జూనియర్ ఎన్టీఆర్ తేల్చి చేప్పేశారు. దానికి చెప్పిన కారణాలు కూడా అంత ఆమోదయోగ్యంగా లేవు. కానీ.. చంద్రబాబు‌తో వేదికని పంచుకోవడం జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఇష్టంలేదనేది బహిరంగ రహస్యం. దాంతో ఇప్పుడు చంద్రబాబు ప్లాన్- బి తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్‌ని గత కొన్నేళ్లుగా అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు చంద్రబాబు పక్కన పెడుతూనే వస్తున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పతాక స్థాయికి చేరిపోయింది. అలానే నందమూరి ఫ్యాన్ బేస్ కూడా ఇప్పుడు జూనియర్ చుట్టూనే తిరుగుతోంది. దాంతో ఏపీలో టీడీపీ‌ మళ్లీ పుంజుకోవాలంటే కాస్త జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కూడా అవసరం. ఇదే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. నెమ్మదిగా అతడ్ని తన ట్రాప్‌లోకి లాగే ప్రయత్నం చేశారు.

కానీ.. 2009 ఎన్నికల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. నిరభ్యంతరంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌తో కలిసి నడుస్తూ తారకరత్న ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఉదంతం కూడా నందమూరి వారసుల్లో బలంగా ఉండిపోయింది. దాంతో వారి అడుగులు ఇప్పట్లో టీడీపీ వైపు పడే అవకాశాలు చాలా తక్కువ.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు వద్ద మిగిలిన ఏకైక ఆప్షన్ మహానాడు. ఎన్నికలకు ముందు జరగబోయే ఈ మహానాడుకి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానుల్ని క్రోడీకరించాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకోసం జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా పిలవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా జూనియర్ ఎన్టీఆర్ ఆ శత జయంతి ఉత్సవాలకు హాజరై ఉంటే.. అక్కడే బహిరంగంగానే మహానాడు కోసం ఆహ్వానం అందించేవారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. బహుశా జూనియర్ ముందే గ్రహించాడేమో తెలివిగా తప్పుకున్నారేమో.

ఈ నెల 20న తాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మల్దీవులకి వెళ్తుండటంతో శతక జయంతి ఉత్సవాలకి హాజరుకాలేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలానే మహానాడుకి ఆహ్వానించినా కూడా షూటింగ్ పేరు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే నందమూరి అభిమానులు ఓ ప్రశ్న వేస్తున్నారు. శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించేందుకు సావ‌నీర్ క‌మిటీ చైర్మ‌న్ టీడీ జ‌నార్ద‌న్‌, నంద‌మూరి రామ‌కృష్ణ మాత్రమే వెళ్లారు. ఒకవేళ ఆ నంద‌మూరి రామ‌కృష్ణ ప్లేస్‌లో నందమూరి బాలకృష్ణ వెళ్లుంటే..? జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పేవాడా..? అంటే సందేహమే. కాబట్టి మహానాడుకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు ఆహ్వానించాలని అనుకుంటే తన వ్యూహాలకి ఇంకాస్త పదును పెట్టాల్సిందే!

Tags:    
Advertisement

Similar News