శ్రీరామ జన్మభూమి వేదికగా బాబు పొత్తు రాజకీయం
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు ఆఘమేఘాల మీద 21వ తేదీనే బయలుదేరి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ చెంతకు చేరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారు. పొత్తు కోసం బాబుకు బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ సహకరిస్తున్నారు. వారిద్దరు కూడా బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని అందరూ అంటున్న మాటే. ఇటీవల చంద్రబాబు నాయుడిని కలుసుకోవడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సీఎం రమేష్ విమానంలోనే విజయవాడకు వచ్చారు. సీఎం రమేష్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదని విమర్శకులు అంటున్నారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు ఆఘమేఘాల మీద 21వ తేదీనే బయలుదేరి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో చంద్రబాబు మోడీకి చేరువ కావడానికి ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. అందుకు సీఎం రమేష్, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సహకరిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రతిదాన్నీ రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ప్రయత్నం ఈ సందర్భంగా ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.