మళ్ళీ యూటర్న్ తీసుకున్నారా?

నాలుగు రోజుల క్రితం వరకు ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్ర‌బాబు.. ఈవీఎంల ఉపయోగంపై మోడీ ఆలోచన తెలియగానే వెంటనే యూటర్న్ తీసుకుని రిమోట్ ఓటింగ్ విధానానికి జై కొట్టేశారు.

Advertisement
Update:2023-01-17 12:38 IST

ఏ విషయంలోనూ చంద్రబాబునాయుడుకు ఒక స్ధిరభిప్రాయం అంటు లేకుండా పోతోంది. దీంతో చాలా విషయాలపై యూటర్నులు తీసుకుంటున్నారు. అందుకనే మంత్రులు, వైసీపీ రాజ్యసభ ఎంపీ చంద్రబాబును యూటర్న్ బాబు అంటూ పదేపదే ఎద్దేవా చేస్తున్నారు. అయినా చంద్రబాబు తన యూటర్న్‌లను మానటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈవీఎంలపైన చంద్రబాబు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. రిమోట్ ఓటింగ్ విధానంపై జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ డెమాన్‌స్ట్రేషన్ ఇచ్చింది.

ఈ భేటీలో కమిషన్ నిర్ణయానికి టీడీపీ జై కొట్టింది. రిమోట్ ఓటింగ్ విధానం చాలా బాగుందంటు అభినందించింది. పార్టీ తరపున ప్రతినిధులుగా వెళ్ళిన పయ్యావుల కేశవ్, వేమూరి రవికుమార్ బ్రహ్మాండమన్నారు. విచిత్రం ఏమిటంటే ఇదే చంద్రబాబు నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించారు. పోలింగులో ఈవీఎంలను ఉపయోగించటం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాబట్టి ఈవీఎంల స్ధానంలో మళ్ళీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాల్సిందే అని డిమాండ్లు చేశారు. ఈవీఎంలనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు రిమోట్ ఓటింగ్ విధానాన్ని అసలు అంగీకరించరనే చాలామంది అనుకున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తేనేమో ఈవీఎంలు బ్రహ్మాండమంటారు. ఓడిపోయినపుడేమో పోస్టల్ బ్యాలెట్లే ఉండాలంటు గోల చేస్తారు. నాలుగు రోజుల క్రితం వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ కోసమే డిమాండ్ చేసిన చంద్రబాబు ఇంత హఠాత్తుగా ఈవీఎంల బ్రహ్మాండమని ఎందుకన్నారు? ఎందుకంటే రిమోట్ ఈవీఎంలపై నరేంద్ర మోడీ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈవీఎంల ఉపయోగంపై మోడీ ఆలోచన తెలియగానే వెంటనే చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుని రిమోట్ ఓటింగ్ విధానానికి జై కొట్టేశారు.

ఈవీఎంలపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవటం కొన్ని పార్టీలకు ఆశ్చర్యం కలిగించాయి. అయితే మిగిలిన పార్టీలు ఏమనుకుంటే ఏమిటి? మోడీ ఏమనుకుంటున్నారన్నదే చంద్రబాబు కావాలి. అందుకనే మోడీ ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు యూటర్న్ తీసేసుకున్నారు. మొత్తానికి యూటర్న్ బాబు అనే పేరును చంద్రబాబు శాశ్వాతం చేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మోడీ దేనికి రెడీ అంటే చంద్రబాబు కూడా దానికే రెడీ అనటమే విచిత్రంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News