12వతేదీ ఉదయం 11.27 గంటలకు

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరం వేదిక కాబోతోంది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement
Update: 2024-06-07 17:12 GMT

చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం కుదిరింది. ఈనెల 12వతేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన, విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 74 ఏళ్ల వయసులో నాలుగోసారి ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు బాబు.

గన్నవరంలో..

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరం వేదిక కాబోతోంది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు ఈ ఏర్పాట్లు పరిశీలించారు. సభా వేదిక కోసం సామగ్రి తరలించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఎప్పుడూ లేనట్టుగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు ఏపీకి రాబోతున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో కీలకమైన నేతగా మారడంతో ప్రమాణ స్వీకారోత్సవం మరింత సందడిగా సాగుతుందని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News