మోదీ తర్వాతే బాబు.. ముహూర్తం వెనక్కు

ఈనెల 8న లేదా 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత ఏపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు.

Advertisement
Update:2024-06-05 20:34 IST

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం కాస్త వెనక్కు వెళ్లింది. ఈనెల 9న ఏపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ముందు అనుకున్నా, తర్వాత వివిధ కారణాలతో ఆ కార్యక్రమం వెనక్కు వెళ్లింది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా మారిన వేళ.. ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ తర్వాతే ఏపీ లో ప్రభుత్వం ఏర్పడుతుందని అంటున్నారు.

11 లేదా 12..

ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్ష మీటింగ్ కి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నరేంద్రమోదీని ఎన్డీఏపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 7న మరోసారి ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది. ఈనెల 8న లేదా 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత ఏపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 11 లేదా 12న ఉంటుందని తెలుస్తోంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ నేతలు హాజరవుతారని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం వెళ్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. కూటమికి భారీ మెజార్టీ రావడంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జరపాలని నిర్ణయించారు. 

Tags:    
Advertisement

Similar News