బాబు వచ్చారు.. మళ్లీ మొదలు పెట్టండి

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచా­రం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Advertisement
Update:2024-08-19 09:10 IST

15 పరిశ్రమల ప్రారంభోత్సవం

6 పరిశ్రమలకు శంకుస్థాపన

5 పరిశ్రమల ఏర్పాటుకి అగ్రిమెంట్లు..

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీసిటీ పర్యటన కార్యక్రమ వివరాలివి. ఈ మొత్తం పరిశ్రమల పెట్టుబడి విలువ రూ.3683 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 20వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెబుతోంది.


ఈ ప్రకటనలు, ప్రచారాలపై వైసీపీ విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచా­రం చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. శ్రీసిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి.. గతంలో జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ప్రారంభోత్సవాలనే మళ్లీ చంద్రబాబు చేతుల మీదుగా చేస్తున్నారని అంటున్నారు.

తమ హయాంలో జరిగిన ప్రారంభోత్సవాలను కూటమి ఘనతగా చెప్పుకోవడం తిరిగి ఆయా పరిశ్రమలనే మళ్లీ ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అంటున్నారు వైసీపీ నేతలు. ఎల్జీ పాలిమర్స్, నైడెక్, ఈప్యాక్‌ డ్యూరబుల్స్, శ్రీలక్ష్మీ ఆగ్రో ఫుడ్స్‌ వంటి పరిశ్రమలు ఆల్రడీ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయని వాటికి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారని అంటున్నారు. గతంలో జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలనే ఇప్పుడు కొత్త సీఎం కూడా రిపీట్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారం జరుగుతోందని, శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త ఒప్పందాల విషయంలో కూటమి ప్రభుత్వం ఘనత ఏమీ లేదని అంటున్నారు వైసీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News