జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు
తన మొబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు. రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇటీవల యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కొన్ని ప్రదేశాలను ఎంచుకుని సెల్ఫీలు దిగుతూ.. సెల్ఫీ ఛాలెంజ్ టు జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో వాటిని వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే జగన్ కి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన ఆయన టిడ్కో ఇళ్లముందు నిలబడి సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే జగన్, చూడు అంటూ ఓ సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జగన్ కు ఛాలెంజ్ విసిరారు..
తమ హయాంలో నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు ఇవే అంటూ చంద్రబాబు ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు. "ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?" అంటూ జగన్ ని ప్రశ్నించారు చంద్రబాబు.
తన మొబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు. రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. #SelfieChallengeToJagan అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేయాలన్నారు.
చంద్రబాబు తన హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన విషయం తెలిసిందే. హడావిడిగా ఎన్నికల ముందు గృహప్రవేశాలు చేయించారు కానీ, వాటిని లబ్ధిదారులకు అప్పగించలేదు. వైసీపీ వచ్చాక ఆ ఇళ్ల సంగతి పూర్తిగా పక్కనపెట్టేశారు. కొన్నిచోట్ల మాత్రమే వాటిని లబ్ధిదారులకు అందించారు. కొత్తగా జగనన్న కాలనీలపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో టిడ్కో ఇళ్లు కేవలం రంగులు మార్చడానికే సరిపోయాయి. సరిగ్గా ఎన్నికల వేళ మళ్లీ ఇప్పుడు చంద్రబాబు టిడ్కో ఇళ్లను చూపిస్తూ సెటైర్లు మొదలు పెట్టారు.