చంద్రబాబును మోడీ అభినందించారా?

బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన డ్వాక్రా వ్యవస్ధ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ పై విషయాన్ని చెప్పారు.

Advertisement
Update:2022-11-17 11:11 IST

రెండు రోజుల పర్యటనలో నరేంద్ర మోడీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును పొగిడారా? పర్యటనలో మోడీ అసలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చినట్లు ఎవరు చెప్పలేదు. పైగా బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన డ్వాక్రా వ్యవస్ధ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ పై విషయాన్ని చెప్పారు. అసలు సంబంధం లేకుండా మోడీ ప్రస్తావన చంద్రబాబు ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్ధంకావటంలేదు.

చంద్రబాబు పేరు కూడా వినటానికి మోడీ ఇష్టపడటం లేదని విశాఖ పర్యటనలోనే అందరికీ అర్ధమైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రపోజల్ పెట్టగానే మోడీ ఆ విషయాన్ని కట్ చేసేశారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీంతోనే చంద్రబాబు ప్రస్తావన వినటానికి కూడా మోడీ ఇష్టపడటం లేదని అందరికీ అర్ధమవుతోంది. అలాంటిది బీజేపీ నేతల సమావేశంలో చంద్రబాబు విషయాన్ని మోడీ ప్రస్తావించి అభినందిస్తారా? మోడీ అన్నారో లేదో తెలియ‌దుకానీ అన్నారని చంద్రబాబు మాత్రం చెప్పేసుకుంటున్నారు.

డ్వాక్రా సంఘాల ఏర్పాటులో చంద్రబాబును మోడీ అభినందించినట్లు బీజేపీ నేతలు ఎవరూ కనీసం ప్రస్తావన కూడా తేలేదు. అసలు డ్వాక్రా వ్యవస్ధను ఏర్పాటు చేసింది చంద్రబాబు కానేకాదు. డ్వాక్రా వ్యవస్ధ ఏర్పాటైంది 1993లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు. పీవీ హయాంలో ఏర్పాటైన డ్వాక్రా వ్యవస్ధను 1995లో సీఎం అయిన తానే ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నారో అర్ధం కావటం లేదు. దేశంలోకి సెల్ ఫోన్ తానే తెచ్చానని, ఇండియాలో ఐటి విప్లవం తన వల్లే వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు.

సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కూడా పీవీ హయాంలోనే. ఇక దేశంలో ఐటి విప్లవం మొదలైంది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నాకూడా వాటిని వక్రీకరిస్తు చంద్రబాబు అంతా తనవల్లే.. అంతా తానే చేశానని పదేపదే చెప్పేసుకోవటం అలవాటైపోయింది. మొత్తానికి తనను మోడీ అభినందించారు అని చెప్పుకుని చంద్రబాబు తృప్తిపడిపోతున్నట్లున్నారు.

Tags:    
Advertisement

Similar News