ముంబై హీరోయిన్ ఆరోపణలపై చంద్రబాబు రియాక్షన్

ఆ స్టోరీలు వింటుంటే, ఆ పార్టీ నేతల బిహేవియర్ గురించి తెలుసుకుంటుంటే అసహ్యం వేస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు.

Advertisement
Update: 2024-08-29 05:26 GMT

కాదంబరి జెత్వానీ. ఆమె ముంబైకి చెందిన హీరోయిన్ అని, ఆమెను వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేధించారని, ఈ క్రమంలో ఆమెపై తప్పుడు కేసులు పెట్టి ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారులు కూడా బ్లాక్ మెయిల్ చేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ మీడియా కథనాలిస్తోంది. ఈ కథనాలను బలపరుస్తూ కాదంబరి జెత్వానీ కూడా తెరపైకి వచ్చారు. మొహం కనపడుకుండా మాస్క్ వేసుకుని ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూ, ఆమె చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.


ఆ స్టోరీలు వింటుంటే, ఆ పార్టీ నేతల బిహేవియర్ గురించి తెలుసుకుంటుంటే అసహ్యం వేస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు. గతంలో రాజకీయాల్లో ఏదో ఒక చిన్న ఘటన జరిగితే అది ఓ పెద్ద స్కాండల్ అని అనుకునేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీలో అలాంటివన్నీ కామన్ అయిపోయాయన్నారు. పార్టీ అధినేత కూడా వాటి గురించి మాట్లాడటం లేదన్నారు. తన పార్టీలో చిన్న చిన్న విషయాలు జరిగినా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు. వీటన్నిటి గురించి తెలుసుకుంటే సిగ్గనిపించడం లేదా అని మీడియాని ప్రశ్నించారు చంద్రబాబు.

రాజకీయ పార్టీలను ఇలా నడుపుతారా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి నాయకులు ప్రజలకు ఆదర్శమా అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి నెట్ వర్క్ వేళ్లూనుకుని పోయిందని, భయంకరమైన నెట్ వర్క్ తో రాష్ట్రాన్ని గంజాయి మత్తులోకి నెట్టివేశారన్నారు. దాన్ని సరిచేయాలంటే అంత ఈజీ కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని సొంత బ్రాండ్లను ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. ప్రశ్నిస్తే బ్లూ మీడియాతో ఎదురుదాడికి దిగేవారన్నారు చంద్రబాబు. ఇలాంటి దౌర్భాగ్య స్థితుల్లో రాజకీయాలు చేయాలా, ఇలాంటి వారితో తాను రాజకీయాలు చేయాలా అని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి రావడం తనకు నామోషీగా ఉందన్నారు. ఇప్పుడు కామ పార్టీలు ఉన్నాయని, వాటి గురించి మాట్లాడటమే అసహ్యం అని అన్నారు చంద్రబాబు. 

Tags:    
Advertisement

Similar News