చంద్రబాబు అదే ప్రయోగం మళ్ళీ చేస్తారా?

1999 ఎన్నికల్లో తటస్థుల కోటాను అమలు చేసి చంద్రబాబు నాయుడు కొంత సక్సెస్ అయ్యారు. మళ్ళీ అలాంటి ప్రయోగాన్నే రేపటి ఎన్నికల్లో కూడా చేసి సక్సెస్ కొట్టాలని ఆలోచిస్తున్నారట.

Advertisement
Update:2022-12-28 11:24 IST

తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఒక చర్చ మొదలైంది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తటస్థుల కోటాను చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నట్లు దాని సారాంశం. తటస్థుల కోటాను 1999 ఎన్నికల్లో అమలు చేసి కొంత సక్సెస్ అయ్యారు. మళ్ళీ అలాంటి ప్రయోగాన్నే రేపటి ఎన్నికల్లో కూడా చేసి సక్సెస్ కొట్టాలని ఆలోచిస్తున్నారట. ఈసారి చేయబోయే ప్రయోగం యువత+ఎన్ఆర్ఐ, ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న సామాజికవర్గాలపైన అమలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకే కేటాయిస్తానని చాలా వేదికల మీద చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. 175 సీట్లలో 40 శాతమంటే 70 సీట్లు కేటాయించాల్సుంటుంది. నిజంగా ఇన్నిసీట్లు యువతకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు. అసలంతమంది గట్టి యువనేతలున్నారా అన్నది కూడా అనుమానమే. సరిగ్గా ఇక్కడే తన పాత ప్రయోగాన్ని మళ్ళీ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్ఆర్ఐలు, కమ్మ సామాజికవర్గంలోని చాలామంది ఆర్ధికంగా బలంగా ఉన్నవాళ్ళు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చితీరాలని బలంగా కోరుకుంటున్నారు.

2014, 19 ఎన్నికల్లో తమ శక్తి కొద్దీ పార్టీకి ఆర్ధికంగా సాయంచేసి ఆదుకున్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారంతా వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆదుకోవటానికి మళ్ళీ రెడీ అవుతున్నారట. గుడివాడ, ప్రకాశం జిల్లాలో నలుగురు, కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో ఇలాంటి ఎన్ఆర్ఐ కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో ఆర్ధికంగానే కాకుండా వివిధ రంగాల్లో స్ధిరపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళల్లో కొందరికి టికెట్లు ఇవ్వటం ద్వారా మొత్తం ఎన్ఆర్ఐలను ఆకట్టుకోవాలనే ప్లాన్ వేస్తున్నారట.

అయితే ఇక్కడ ఒక సమస్యుంది. అదేమిటంటే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చాలాచాలా కీలకమైనది. రేపటి ఎన్నికల్లో గనుక ఓడిపోతే చంద్రబాబుతో పాటు పార్టీ భవిష్యత్తు కూడా అంతేసంగతులు. తెలంగాణలో పార్టీ పరిస్ధితే ఏపీలో కూడా వచ్చేయటం ఖాయం. మరింతటి కీలకమైన ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగం చేస్తారా? అనేది డౌటు. మరి చివరకు ఏం చేస్తారో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News