ఎంపీ టికెట్ దక్కలేదు.. ఎమ్మెల్యేనైనా చేద్దాం.. సుజనాచౌదరిపై బాబు ప్రేమ
ఎక్కడో కడప జిల్లాకు చెందిన నేత, అందునా పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసం ఉండే సీఎం రమేష్‌కు ఏకంగా ఏడెనిమిది జిల్లాలు దాటించి, అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది బీజేపీ.
సుజనా చౌదరి, సీఎం రమేష్.. ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు మనుషులే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అందుకే బీజేపీలో చేరినా వాళ్ల బాగోగులు బాబుగారే చూస్తున్నారనడానికి తాజాగా సీట్ల కేటాయింపులో వారికోసం ఆయన పడిన తాపత్రయమే నిదర్శనం. పొత్తులో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చినా అందులో తనవాళ్లనే నింపడానికి చంద్రబాబు అన్ని విధాలా ప్రయత్నించారు. చివరికి సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెటిప్పించగలిగారు. సుజనాచౌదరికి ఏలూరు ఎంపీ టికెటిద్దామని ముందు అనుకున్నా కుదరలేదు. దీంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని, విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయించాలని బీజేపీపై బాబు ఒత్తిడి తేబోతున్నారు.
ఎక్కడో కడప జిల్లాకు చెందిన నేత, అందునా పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసం ఉండే సీఎం రమేష్‌కు ఏకంగా ఏడెనిమిది జిల్లాలు దాటించి, అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది బీజేపీ. ఆ మేరకు బీజేపీని చంద్రబాబు ప్రభావితం చేశారనుకోవచ్చు. కానీ, సుజనాకు ఆ అవకాశం లేకపోయింది. ఏలూరులో టికెటిద్దామనుకుంటే అక్కడ వైసీపీ తరఫున బీసీ అభ్యర్థి ఉన్నారు. కమ్మ అభ్యర్థిని అదీ బీజేపీ అభ్యర్థిని నిలబెడితే కష్టం అని భావించిన చంద్రబాబు ఆ సీటును తానే తీసుకుని తానూ బీసీ అభ్యర్థినే నిలబెట్టారు.
విజయవాడ వెస్ట్‌పై దృష్టి
జనసేనకు పొత్తులో టీడీపీ కేటాయించిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పవన్‌కళ్యాణ్ బీజేపీకి ఇచ్చేశారు. అక్కడి నుంచి సుజనా చౌదరిని పోటీ చేయించాలన్నది చంద్రబాబు కొత్త ప్లాన్. నమ్మినవారిని నట్టేట ముంచేసే బాబు తనకు కావాల్సినవారి కోసం ఎంతదూరమైనా వెళతారనడానికి ఇవే నిదర్శనాలు..