కృష్ణా జిల్లా నేత‌ల‌కి చంద్ర‌బాబు క్లాస్‌

తెలుగుదేశం పార్టీ ఉమ్మ‌డి కృష్ణా జిల్లా నేత‌ల‌పై టిడిపి అధినేత చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు.

Advertisement
Update:2022-09-07 18:15 IST

తెలుగుదేశం పార్టీ ఉమ్మ‌డి కృష్ణా జిల్లా నేత‌ల‌పై టిడిపి అధినేత చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. పార్టీలో కీల‌క నేత‌పై దాడి జ‌రిగినా, రాష్ట్ర‌మంతా స్పందించినా కృష్ణా జిల్లా టిడిపి నేత‌ల‌కి క‌నీసం చీమ కుట్టిన‌ట్ట‌యినా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ చెన్నుపాటి గాంధీపై వైసీపీ వాళ్లు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిస్తే, క‌నీసం స్పందించక‌పోవ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. ఇదే విష‌యంపై రెండ్రోజుల క్రితం జ‌రిగిన టెలికాన్ఫరెన్స్ లోనే నేత‌లంద‌రికీ క్లాస్ పీకారు.

ఈ విష‌యం ఇంత‌టితో అయిపోయింద‌నుకున్న టిడిపి నేత‌ల‌కి చంద్ర‌బాబు ఝ‌ల‌క్ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల ఇన్ చార్జులతో బుధ‌వారం టిడిపి కేంద్ర కార్యాల‌యంలో అత్యవసర భేటీ నిర్వ‌హించారు. చెన్నుపాటి గాంధీ ఘటనపై స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్య‌క్తంచేశారు. సాటి నాయ‌కుడిపై దాడి జ‌రిగితే ఇంత నిర్లిప్తంగా ఉంటారా అని ప్ర‌శ్నించారు.

చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో నిందితుల అరెస్ట్

టిడిపి నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఫిర్యాదుపై హత్యాయత్నం కేసు న‌మోదు చేశారు. దాడికి పాల్ప‌డిన వారిలో ప‌ట‌మ‌ట‌లంక‌కి చెందిన‌ గద్దె కళ్యాణ్ రామ్, రాణిగారి తోట‌కి చెందిన తమ్మిశెట్టి లీలా కృష్ణ, రామలింగేశ్వర నగర్ కి చెందిన ఆలచింతపల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Tags:    
Advertisement

Similar News