అల్లు అర్జున్ మద్దతుపైనా చంద్రబాబు అక్కసు

అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కానీ అల్లు అర్జున్ ను అనలేక శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని తప్పు పట్టారు.

Advertisement
Update:2024-05-11 22:00 IST

సినీ హీరో అల్లు అర్జున్ మీద టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన అక్కసును వెళ్ళగక్కారు. వైఎస్సార్ సీపీ తరఫున నంద్యాల నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకోవడం చంద్రబాబుకు తప్పుగా తోచింది. అల్లు అర్జున్ ను శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి వాడుకున్నారంటూ చంద్రబాబు తప్పు పట్టే ప్రయత్నం చేశారు.

‘అల్లు అర్జున్ మీ ఇంటికి వచ్చాడు, తప్పు లేదు. తప్పుడు రాజకీయాలు, చవట రాజకీయాలు చేస్తారా? పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడు అవునా, కాదా? వేరే పార్టీలు వాడుకోవడం నీతిబాహ్యం అవునా, కాదా... తప్పు అవునా, కాదా? అన్నీ చీకటి రాజకీయాలు’ అంటూ చంద్రబాబు వీరావేశంతో ఊగిపోయారు. చంద్రబాబు మాత్రం షర్మిలను, సునీతను త‌న రాజ‌కీయం కోసం వాడుకోవచ్చునేమో. అదేం తప్పు కాదు. కానీ అల్లు అర్జున్ తనంత తానుగా తన మిత్రుడికి మద్దతు ప్రకటిస్తే తప్పయిపోయింది.

అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కానీ అల్లు అర్జున్ ను అనలేక శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని తప్పు పట్టారు. తనకు నచ్చిన వ్యక్తికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం చంద్రబాబుకు తప్పుగా కనిపించింది. శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి అల్లు అర్జున్ తనంత తానుగా మద్దతు ఇచ్చారు. ఇక్కడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తప్పేం ఉందో చంద్రబాబు మాత్రమే చెప్పాలి.

అల్లు అర్జున్ అభిమానులు పెద్ద యెత్తున వచ్చారు. ఆ సమయంలో శిల్పా రవి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు. అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రారెడ్డికి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు. ఇందులో శిల్ప రవి తప్పేమీ లేదు. అల్లు అర్జున్ కు ఇష్టం లేకపోతే అసలు వచ్చేవారే కారు.

‘‘శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్ గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్ లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేం తక్కువగా కలుస్తూ వచ్చాం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేను నంద్యాలకు వచ్చాను. ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అల్లు అర్జున్ చెప్పారు.

అల్లు అర్జున్ తనంత తానుగా రవిచంద్రారెడ్డిని బలపరస్తూ ఆయన విజయం సాధించాలని కోరుకున్నారు. దీంట్లో చంద్రబాబుకు తప్పు కనిపించింది. అల్లు అర్జున్ ను ఏమీ అనలేక రవిచంద్రారెడ్డిని తప్పు పట్టారు. నిస్సహాయతతో ఆయన ఆ విధంగా మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News