అలా మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారనే ఇంగితం కూడా లేదా..?
ప్రత్యర్థులపై, ముఖ్యంగా జగన్ మీద అభాండాలు వేయడానికి చంద్రబాబు ఏ మాత్రం వెనకాడరనేది గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా తెలియజేస్తున్నాయి. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు ఓటమి భయం గట్టిగానే పట్టుకుంది. 40 ఏళ్ల రాజకీయ జీవిత అనుభవంతో హుందాగా వ్యవహరించాల్సిన సీనియర్ నాయకుడు గల్లీ లీడర్ మాదిరిగా మాట్లాడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు, తనకు తేడా లేదని రుజువు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను హేళన చేస్తూ అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడుతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా?’’ అని ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడారు. పాయకరావుపేట ప్రజాగళం సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్ మెంట్ లదే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్ కు, సీఎస్ కు బాధ్యత లేదా?’’ అని కూడా ఆయన అన్నారు.
చంద్రబాబు మతి భ్రమించి అకారణంగా జగన్ మీద మరింత రెచ్చిపోయారు. ‘‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలివేటుతో బాబాయిని చంపేసి నా మీద పెట్టాలని చూశావు. ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నావు’’ అని ఆయన రెచ్చిపోయి జగన్ మీద వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద జరిగిన దాడిని అవహేళన చేస్తూ మాట్లాడడంపై ప్రజలు తనను అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని ఆయన గ్రహించడం లేదు.
ప్రత్యర్థులపై, ముఖ్యంగా జగన్ మీద అభాండాలు వేయడానికి చంద్రబాబు ఏ మాత్రం వెనకాడరనేది గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా తెలియజేస్తున్నాయి. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారు. వాజ్ పేయితో మాట్లాడి తానే గతంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపించానని ఏ మాత్రం సిగ్గుపడకుండా చంద్రబాబు అబద్ధం చెప్పేశారు.