జనసేన ఖాళీ.. ఇక బీజేపీ వంతు.. చంద్రబాబా మజాకా..!
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి బీజేపీ తరఫున టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డికి చంద్రబాబునాయుడు సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?. స్వార్థ రాజకీయాలకు కేరాఫ్ బాబు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే జనసేన టికెట్లలో చాలా వరకు చంద్రబాబు ఆక్రమించేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో ముందే జరిగిన ఒప్పందంలో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లను ఇచ్చారు. పాపం ఈ విషయం పవన్ కల్యాణ్ అభిమానులకు ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే జనసేన మొత్తం ఖాళీ అయ్యింది. జనసేనే అనుకుంటే, ఇప్పుడు బీజేపీని కూడా ఖాళీ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి బీజేపీ తరఫున టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డికి చంద్రబాబునాయుడు సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తు కుదరడంతో అనపర్తిని ఆ పార్టీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ప్రస్తుతం శివరామకృష్ణంరాజు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తనకు కేటాయించిన టికెట్‌ను రద్దు చేసి, బీజేపీకి ఇవ్వడంతో మనస్తాపం చెందారు రామకృష్ణారెడ్డి. న్యాయం కోసమంటూ ఆయన ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించింది.
సాయంత్రం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించబోతున్నారు రామకృష్ణారెడ్డి. ఆత్మీయ సమావేశాలన్నీ జనాన్ని మభ్య పెట్టేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం టికెట్ కోసమే రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే వైఎస్సార్ జిల్లా బద్వేలులో బీజేపీ నేత సురేష్‌ను బలిచేసి, టీడీపీ నేత రోశన్నకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అనపర్తిలోనూ మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకు అదే గతి పట్టించి, టీడీపీ నేత రామకృష్ణారెడ్డికి సీటు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరిది రాజకీయ ప్రయోజనాల కోసం తన పార్టీ వాళ్లను కూడా అణచివేయడానికి పురందేశ్వరి ఏ మాత్రం వెనుకాడకపోవడం చర్చనీయాంశమైంది.