అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగ కల్పనపై బాబు బడాయి!
గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 34,108 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయన హయాంలో ఒక్క కియా మాత్రమే వచ్చింది. దాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఎప్పటిలాగే తప్పుడు హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దొంగ హామీలను నమ్మి ఇదివరకే ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు అయితే, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనది ఇచ్చిన మాటను మరిచిపోయే తత్వం అనే సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే.
తాజాగా మరోసారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు మరోసారి తన మాటల ద్వారా అందరినీ మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ బాబు ఇస్తున్నటువంటి హామీలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 34,108 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయన హయాంలో ఒక్క కియా మాత్రమే వచ్చింది. దాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలా ఐదేళ్ల కాలంలో 34 వేల ఉద్యోగాలను కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఎలా చెబుతున్నారు, అన్ని ఉద్యోగాలు ఎక్కడున్నాయో కనీసం ఆ దేవుడికి కూడా తెలియదని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. అక్షరాల ఆ సంఖ్య 6,16,323. వైసీపీ ప్రభుత్వం 2,06,638 పర్మినెంట్ ఉద్యోగాలను కల్పించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికపై 37,908 ఉద్యోగాల కల్పన జరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 3,71,777 ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా 3,85,777 మంది నియమితులయ్యారు. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఉద్యోగులందరినీ జగన్ రెగ్యులర్ చేశారు.
ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పరిశ్రమలను అలాగే ఎన్నో పెట్టుబడులను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనీ స్పష్టంగా తెలుస్తుంది.