అనపర్తిపైనా కన్నేసిన చంద్రబాబు.. బీజేపీకి జెల్ల కొట్టేయబోతున్నట్లే
జనసేనకు అవనిగడ్డ ఇచ్చి అక్కడ తమ పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి పంపి టికెట్ తెచ్చుకున్నారు. పాలకొండలో జనసేన అభ్యర్థిత్వం ఆశిస్తూ పార్టీలో చేరిన నిమ్మక జయకృష్ణ కూడా టీడీపీ బ్యాచే.
రాజకీయాల్లో చంద్రబాబును మించిన జాదూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలో కూడా ఉండరేమో. పేరుకే జనసేన, బీజేపీతో పొత్తు. వాళ్లకిచ్చిన స్థానాల్లో అయితే తన వాళ్లను, తనకు నచ్చినవాళ్లను అభ్యర్థులుగా ఆ పార్టీ నేతల్ని ఒప్పించడం.. లేదంటే టీడీపీ నేతల్నే జనసేన, బీజేపీల్లోకి పంపి వాళ్లకు ఆ పార్టీ గుర్తుమీద టికెట్లు ఇప్పించుకోవడం.. లేదంటే పొత్తులో ఇచ్చిన నియోజకవర్గాల్ని ఏదో రకంగా లాగేసుకోవడం ఇలా రకరకాల మాయలు చేస్తున్నారు. అవనిగడ్డలో జనసేనకు అలాగే జలక్ ఇచ్చిన బాబు.. ఇప్పుడు అనపర్తిలో బీజేపీకి షాకివ్వబోతున్నారు.
జనసేనకు అవనిగడ్డ ఇచ్చి అక్కడ తమ పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి పంపి టికెట్ తెచ్చుకున్నారు. పాలకొండలో జనసేన అభ్యర్థిత్వం ఆశిస్తూ పార్టీలో చేరిన నిమ్మక జయకృష్ణ కూడా టీడీపీ బ్యాచే. ఇక బీజేపీకి పొత్తులో కేటాయించిన అనపర్తిపైనా బాబు మాట మారుతోంది. అనపర్తిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ నిన్న కొవ్వూరు సభలో ప్రకటించి బాబు మనసులో మాట బయటపెట్టేశారు. దాన్ని బీజేపీ నుంచి లాగేయడానికి రంగం సిద్ధం చేసినట్లే కనిపిస్తోంది.
రాజమండ్రి ఎంపీ గెలవడం సులువవుతుందట
అనపర్తిలో టీడీపీ అభ్యర్థి ఉంటే ఆ స్థానం గెలవడమే కాదు.. రాజమండ్రిలో మీ అభ్యర్థి నిల్చున్న ఎంపీ స్థానం గెలవడానికి కూడా మార్గం సుగమమవుతుంది అంటూ చంద్రబాబు బీజేపీ పెద్దలకు బ్రెయిన్‌వాష్ చేయడం మొదలుపెట్టారని సమాచారం. పైగా అక్కడ నిలబడుతున్నది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. ఆమె ఓడిపోతే పరువు పోతుంది కాబట్టి అనపర్తి మాకు వదిలేయండని కమలం పార్టీని భయపెట్టి అయినా సరే టికెట్ లాగేయడానికి బాబు ఫిక్సయిపోయారు.