చంద్రబాబు హెల్త్ అప్ డేట్... ఈరోజు డాక్టర్ల ప్రెస్ మీట్

చంద్రబాబుకి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదన్నారు. గతంలో ఆయన వాడుతున్న మందుల్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. వాటిని కూడా తాము చూశామని, వాటికి అదనంగా కొన్ని మందులు వాడాల్సి ఉందని చెప్పారు వైద్యులు.

Advertisement
Update:2023-10-14 18:49 IST

చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో నిన్న జైళ్ల డీఐజీ రవికిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాకు అన్ని వివరాలు చెప్పారు. ఈరోజు డాక్టర్లను కూడా ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టారు. వారితో కూడా వివరాలు చెప్పించారు. ప్రస్తుతం జైలులో చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే ఆయనకు చల్లని వాతావరణం అవసరం అని జైలు అధికారులకు సిఫారసు చేసినట్టు చెప్పారు.

చర్మసంబంధిత సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకి డాక్టర్లు కొన్ని మందులు సూచించారు. అయితే ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు వాటిని ఉపయోగిస్తానని తమతో చెప్పినట్టు వివరించారు వైద్యులు. చంద్రబాబుకి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదన్నారు. గతంలో ఆయన వాడుతున్న మందుల్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. వాటిని కూడా తాము చూశామని, వాటికి అదనంగా కొన్ని మందులు వాడాల్సి ఉందని చెప్పారు.డీహైడ్రేషన్ అనేది వేడి ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ అని, అయితే చంద్రబాబుకి డీహైడ్రేషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదని అన్నారు వైద్యులు.

ప్రస్తుతం వైద్యులు అందించిన నివేదికను తాము కోర్టుకి సమర్పిస్తామని, కోర్టు నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు జైలు అధికారులు. ఖైదీలకు ఏసీ, కూలర్ సౌకర్యం ఉండదని, కోర్టు సూచిస్తే వాటిని సమకూరుస్తామన్నారు. చల్లనివాతావరణం కోసం తమకు తామే ఏసీని తెచ్చి పెట్టలేమన్నారు అధికారులు. అదే సమయంలో చంద్రబాబుని ఇప్పటికిప్పుడు ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం కూడా లేదన్నారు. వ్యక్తిగత వైద్యులను అనుమతించబోమని, అయితే వారి సలహాలు, సూచనలు.. కోర్టు అనుమతి మేరకు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. రోజుకి మూడుసార్లు సాధారణ వైద్య పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. 

Tags:    
Advertisement

Similar News