ద్రోహానికి మారు పేరు.. బీసీ నేతలకు చంద్రబాబు కుచ్చుటోపీ

వైఎస్‌ జగన్‌ మాత్రం సీట్ల కేటాయింపులో బీసీలకు పెద్ద పీట వేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్జానాలు కలిపి మొత్తం 200 సీట్లలో 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. బీసీలకు, మహిళలకు ఆయన పెద్దపీట వేశారు.

Advertisement
Update:2024-03-29 18:16 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసీలకు తీరని ద్రోహం చేశారు. బీసీలకు మేలు చేసింది తానేనని, ఇక ముందు కూడా చేస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. మొత్తం 25 లోక్‌సభ స్జానాల్లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 20 అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లలో 11 బీసీలకు కేటాయించారు. టీడీపీ మాత్రం ఆరు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది.

బీసీ జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను చంద్రబాబు తన సొంత వర్గానికి కేటాయించారు. తాజాగా 4 లోక్‌సభ స్థానాలను చంద్రబాబు ప్రకటించారు. కూటమిలోని టీడీపీ 17 స్థానాలకు, బీజేపీ 6 స్థానాలకు, జనసేన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ మొత్తంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది చంద్రబాబు. టీడీపీకి దక్కిన 17 స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.

వైఎస్‌ జగన్‌ మాత్రం సీట్ల కేటాయింపులో బీసీలకు పెద్ద పీట వేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్జానాలు కలిపి మొత్తం 200 సీట్లలో 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. బీసీలకు, మహిళలకు ఆయన పెద్దపీట వేశారు. ఆయన సామాజిక సమతూకం పాటించారు.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ జగన్‌ 48 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. 25 లోక్‌సభ స్థానాల్లో 11 సీట్లు బీసీ నేతలకు కేటాయించారు. ఈ స్థితిలో చంద్రబాబు అమలు చేస్తానని ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఏ గతి పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News