అమిత్ షాయే రమ్మన్నారట.. రాష్ట్రం కోసం వెళ్లాల్సి వస్తోందట!
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బాబును కోరారట! రాష్ట్రాభివృద్ధికి కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారట!
ఎన్డీయేలోకి తిరిగి రమ్మని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే ఆహ్వానించారు. కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తుందనిపిస్తోంది. రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి.. అవన్నీ సరిదిద్దాలన్నా, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, రాజధాని కట్టాలన్నా కేంద్ర సహకారం ఉండాల్సిందే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టాల్సి వస్తోంది... అని చంద్రబాబు తమ పార్టీ నాయకులతో చెప్పారట... బీజేపీతో పొత్తు చంద్రబాబే దేబిరిస్తున్నారన్న భావం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఆయన అనుకూల మీడియా రాస్తున్న రాతలివీ..
టీడీపీ వస్తే బాగుంటుందన్నారట!
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బాబును కోరారట! రాష్ట్రాభివృద్ధికి కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారట! మైనారిటీలు జగన్ విధానాలతో విసిగిపోయి టీడీపీ వైపు చూస్తున్నారని, మీతో కలిస్తే వాళ్లు టీడీపీ వైపు రాకుండా వెనకడుగు వేస్తారని కూడా వారితో చెప్పాను. నేనేమీ దాచుకోలేదు. వారితో ఉన్నదున్నట్లు చెప్పేశాను. అయినా వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు.. ఇవన్నీ చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారట!
నన్ను పిలవండని ముందే రాయబారాలు పంపి ఇంత కలరింగా!
చంద్రబాబు దూతగా కంభంపాటి రామ్మోహనరావు అమిత్‌షాను కలిసి మీరేమన్నా మాకు అంగీకారమే సర్ అని బాబు మాటగా చెప్పి వచ్చారు. ఆ తర్వాతే అమిత్‌షా బాబును పిలిచిన సంగతి అందరికీ తెలుసు. కానీ షా గారే రమ్మన్నారని టీడీపీ అధినేత, ఆయన అనుకూల మీడియా పిచ్చ కలరింగ్ ఇస్తోంది. నిజంగా షా గారే అంత ఆప్యాయంగా పిలిస్తే అర్ధరాత్రి దాకా మన బాబు గారిని వెయిట్ చేయిస్తారా అని సెటైర్లు వినిపిస్తున్నాయి మరి!