జగన్ పథకాలకు మద్దతిచ్చిన చంద్రబాబు, పవన్
రాష్ట్రం అప్పుల కుప్పలాగ అయిపోయింది కాబట్టి వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. సీన్ కట్ చేస్తే ముందు చంద్రబాబునాయుడు తాజాగా పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామంటు జనాలకు హామీలిచ్చారు.
ఏపీ మరో శ్రీలంకలాగ అయిపోతోందని గోలగోల చేశారు. సంక్షేమ పథకాల రూపంలో డబ్బంతా పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటు రచ్చరచ్చ చేశారు. రాష్ట్రం అప్పుల కుప్పలాగ అయిపోయింది కాబట్టి వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. సీన్ కట్ చేస్తే ముందు చంద్రబాబునాయుడు తాజాగా పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామంటు జనాలకు హామీలిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ మరో శ్రీలంకలా అయిపోతోందని గింజుకున్న చంద్రబాబు, పవనే సడెన్‌గా ఎందుకు ప్లేటు ఫిరాయించారు?
జగన్ మీద దుమ్మెత్తిపోయటానికి ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆదాయమంతా జగన్ సంక్షేమ పథకాల అమలుకే ఖర్చుచేసేస్తున్నట్లు ఎగిరెగిరిపడ్డారు. జగన్ కారణంగా ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్ధిక పరిస్ధితి దిగజారిపోతోందని ఆరోపణలు, విమర్శలు చేయని రోజంటు ఉండేది కాదు. చంద్రబాబు బాటలోనే పవన్ కూడా ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని గోలచేశారు.
వీళ్ళిద్దరి గోల చూసి మంత్రులు, వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. తాము అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను నిలిపేస్తామని ప్రకటించండి అని చాలెంజ్ చేశారు. వాళ్ళ చాలెంజ్‌లకు ఇటువైపు నుండి సౌండ్ రాలేదు. అయితే హఠాత్తుగా చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్లుంది. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎదురుదెబ్బలు తప్పవని గ్రహించినట్లున్నారు. అందుకనే కుప్పం పర్యటనలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పటికన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ తర్వాతెప్పుడూ ఏపీని శ్రీలంకతో పోల్చలేదు.
ఇన్నిరోజులుగా గోలను కంటిన్యూ చేస్తున్న పవన్ హఠాత్తుగా విజయనగరం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ జనసేన అధికారంలోకి రాగానే అన్నీ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తుందని హామీఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంపూర్ణ మద్దతిచ్చినట్లే అని అర్ధమవుతోంది. మరింతకాలం సంక్షేమ పథకాల అమలుపై ఎందుకు నోటికొచ్చినట్లు మాట్లాడారు? అలా మాట్లాడారు కాబట్టే జనాల్లో వ్యతిరేకత పెరిగితోందన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే జరిగిన డ్యామేజిని కంట్రోల్ చేసుకోవటంలో భాగంగానే తాము కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు.