ఆ కుర్చీ మడతపెట్టి.. బాబు, లోకేష్ అల్ప సంతోషం

తండ్రీ కొడుకులిద్దరికీ ఫ్రస్టేషన్ పెరిగిపోయింది. అందుకే ఇలా బూతు డైలాగులు పట్టుకుని రెచ్చిపోతున్నారు. కుర్చీ మడతపెట్టేస్తామంటూ లేనిపోని బీరాలు పలుకుతున్నారు.

Advertisement
Update:2024-02-16 16:13 IST

ఇటీవల చంద్రబాబు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 'ఆ కుర్చీ మడతపెట్టి'.. అనే డైలాగ్ చెబుతూ కాస్త అతిగా ప్రవర్తించారు. ఇన్నేళ్లు నికార్సయిన రాజకీయం చేశానని చెప్పుకునే చంద్రబాబు.. స్టేజ్ పై బూతు డైలాగు చెప్పి తన పరువు తానే తీసుకున్నారు. ఆ బూతు బాగా వర్కవుట్ అయిందనుకున్నారో ఏమో.. నారా లోకేష్ కూడా ఈరోజు అదే స్టైల్ లో రెచ్చిపోయారు. పైగా స్టేజ్ మీదే కుర్చీని మడతపెట్టి విచిత్రంగా ప్రవర్తించారు. సీఎం జగన్ కి ఏపీలో సీటు లేకుండా చేస్తామని, కుర్చీ మడతపెట్టినట్టు ఆయన సీటు మడతపెట్టేస్తామని హెచ్చరించారు.


ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్

యువగళం అన్నారు, ఎవరూ పట్టించుకోలేదు. శంఖారావం అన్నారు, ఆవైపు కన్నెత్తి చూడట్లేదు. పేపర్ చూసి అప్పజెప్పే డైలాగుల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో జనం ఛీకొడుతున్నారు. దీంతో తండ్రీ కొడుకులిద్దరికీ ఫ్రస్టేషన్ పెరిగిపోయింది. అందుకే ఇలా బూతు డైలాగులు పట్టుకుని రెచ్చిపోతున్నారు. కుర్చీ మడతపెట్టేస్తామంటూ లేనిపోని బీరాలు పలుకుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన పరిస్థితి ఏంటనే విషయంలో ఇప్పటికే జనాలకు క్లారిటీ వచ్చేసింది. కూటమి నేతలకు కూడా తత్వం బోధపడింది. అందుకే చంద్రబాబు, లోకేష్ ఇలా కుర్చీలు మడతపెట్టే వరకు వచ్చేశారు. ముందు ముందు వీరిద్దరి నుంచి ఇంకెన్ని ఆణిముత్యాలు వినాల్సి వస్తుందోనని జనం భయపడుతున్నారు.

రాజధాని ఫైల్స్ కి లోకేష్ ప్రచారం..

టీడీపీకి అనుకూలంగా, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెరకెక్కిన రాజధాని ఫైల్స్ సినిమా ఇటీవల థియేటర్లలోకి ఇలా వచ్చి అలా మాయం అయింది. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను నారా లోకేష్ తలకెత్తుకున్నట్టుగా కనపడుతోంది. ఆ సినిమా పేరు చెబితేనే జగన్ కు భయమేస్తోందని.. థియేటర్ల వద్దకు పోలీసుల్ని పంపించి మరీ అడ్డుకున్నారని మండిపడ్డారు లోకేష్. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. 

Tags:    
Advertisement

Similar News