ఇక్కడ అభ్యర్థులు ఫైనలైపోయారా?
వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కడప జిల్లా నుండి లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది మొదలు ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర మొత్తాన్ని దగ్గరుండి ఆనమే చూసుకున్నారు. ఆనం పోటీ చేయబోయే విషయాన్ని జిల్లాలోని సీనియర్లకు చంద్రబాబు స్పష్టం చేశారట.
రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారైపోయినట్లే. టీడీపీ నుండి వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు బహిరంగంగా ప్రకటించకుండా నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. కడప జిల్లా నుండి లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది మొదలు ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర మొత్తాన్ని దగ్గరుండి ఆనమే చూసుకున్నారు. ఆనం పోటీ చేయబోయే విషయాన్ని జిల్లాలోని సీనియర్లకు చంద్రబాబు స్పష్టం చేశారట.
అందుకనే ఆత్మకూరులో ఆనం పోటీ ఖాయమైపోయింది. ఇక వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేయటం ఖాయం. మేకపాటి కుటుంబానికి ఆర్థిక, అంగ బలాలకు కొదవలేదు కాబట్టి ఇద్దరి మధ్య పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశముంటుంది. ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుండి విక్రమ్ నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు. సోదరుడు గౌతమ్‌కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. కాబట్టి ఆ గుడ్ విల్ వచ్చే ఎన్నికల్లో కూడా విక్రమ్‌కు కలిసొచ్చే అవకాలున్నాయి.
ఆనం చివరిసారిగా 2009లో ఆత్మకూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో గ్యాప్ వచ్చినా 2019లో వైసీపీ తరపున వెంకటగిరి నుండి పోటీ చేసి గెలిచారు. అంటే పదిహేనేళ్ళ తర్వాత ఆనం మళ్ళీ ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. రాపూర్ నుంచి రెండు సార్లు గెలిచి తర్వాత ఆత్మకూరులో గెలిచారు. మళ్ళీ వెంకటగిరిలో కూడా గెలిచారంటేనే ఆనంకు గట్టి మద్దతుదారులున్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి గట్టి నేతను మేకపాటి విక్రమ్ రెడ్డి ఢీ కొనబోతున్నారు.
ఆత్మకూరులో చివరి మూడు ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీనే గెలుస్తోంది. రెండుసార్లు మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచారు. గౌతమ్ అకాల మరణంతో 2022లో జరిగిన ఉపఎన్నికలో సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచారు. విక్రమ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రెగ్యులర్‌గా పర్యటిస్తునే ఉన్నారు. నియోజకవర్గంలోని నేతలందరితోనూ టచ్‌లో ఉంటున్నారు. కాబట్టి ఫ్యామిలీపరంగా మేకపాటికి ఎదురులేదు. మొత్తం మీద జిల్లాలో బాగా గట్టిపోటీ జరగబోయే నియోజకవర్గాల్లో ఆత్మకూరును కూడా చెప్పుకోవాల్సిందే.