జగన్ ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు ఇవ్వగలరా?

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బేషరతుగా ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అందుకు బీజేపీ పెద్దల వద్ద సాగిలబడ్డారు

Advertisement
Update: 2024-05-03 11:58 GMT

ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా స్పష్టతతో ఉన్నారు. ఈ స్పష్టత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతున్నారు. తాము ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి వ్యతిరేకమని జగన్ చెప్పారు. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాకుండా సీఏఏకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకు తాను వ్యతిరేకమని, మిగతా విధానాలపై తాను సానుకూలంగానే ఉన్నానని జగన్ చెప్పారు. బీజేపీతో అంటకాగుతున్నాడని చంద్రబాబు గతంలో జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే విభేదించాల్సిన అంశాలపై వైఎస్ జగన్ విభేదిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

ఏదో ఆశించి వైఎస్ జగన్ గంపగుత్తగా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బేషరతుగా ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అందుకు బీజేపీ పెద్దల వద్ద సాగిలబడ్డారు.

సీఏఏపై గానీ, యుసీసీపై గానీ చంద్రబాబు స్పష్టత ఇవ్వగలరా అనేది ప్రశ్న. వాటికి వ్యతిరేకంగానో, సానుకూలంగానో స్పందించే దమ్మూ ధైర్యం ఆయనకు లేదు. దాంతో ముస్లిం మైనారిటీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. బీజేపీకి చంద్రబాబు పూర్తిగా సరెండర్ అయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం మైనారిటీలో భయాందోళనలు పెంచుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News