తొలి విజయం బుచ్చయ్యది.. మెజార్టీ 63వేలు

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై 63,056 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఇది ఏడో విజయం కావడం విశేషం.

Advertisement
Update:2024-06-04 11:55 IST

ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. కూటమి తరపున తొలి విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై 63,056 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఇది ఏడో విజయం కావడం విశేషం.

2008లో నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రాజమండ్రి రూరల్ లో వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఇక్కడ మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడించారు బుచ్చయ్య చౌదరి. ఇక 2024నాటికి పార్టీలో టికెట్ కోసం ఆయన కష్టపడాల్సి వచ్చింది. పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కందుల దుర్గేశ్ కి ఆ టికెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బుచ్చయ్య చౌదరికి టికెట్ ఇచ్చారు. ఆయన విజయం సాధించారు.

రాజమండ్రి రూరల్ లో బీసీల ప్రాబల్యం ఎక్కువ. శెట్టి బలిజలు 22 శాతం ఉండగా, ఎస్సీలు 20 శాతం ఉన్నారు. కాపులు 16 శాతం, దేవాంగులు 10 శాతం, యాదవులు 6 శాతం, వెలమలు 5 శాతం ఉన్నారు. బీసీ ఓటర్లను ఆకర్షించడం కోసం శెట్టిబలిజ వర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను వైసీపీ రంగంలోకి దింపింది. కానీ ఫలితం మాత్రం తేడా వచ్చింది. మంత్రి చెల్లుబోయినపై 63వేల భారీ ఆధిక్యంతో గెలిచారు బుచ్చయ్య చౌదరి.

Tags:    
Advertisement

Similar News