మరణంలో తోడొద్దని.. ప్రియురాలిని వెనక్కి నెట్టి రైలు కిందపడిన ప్రియుడు

వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి బైక్ పై పాలకొల్లు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.

Advertisement
Update:2024-08-30 19:25 IST

ఆ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. కలిసి బతికే అవకాశం ఎలాగూ లేదు.. కలిసి చావనైనా చద్దాం.. అని ఆ ప్రేమ జంట నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాల వద్దకు చేరుకుంది. అయితే ఆఖర్లో తాను చనిపోయినా పర్వాలేదు.. తన ప్రియురాలు మాత్రం బతికి ఉండాలని భావించిన ప్రియుడు రైలు వస్తున్న సమయంలో ప్రియురాలిని వెనక్కి నెట్టి తాను మాత్రం రైలు కింద‌ప‌డి ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది.

భీమవరం రైల్వే ఎస్ఐ టీవీ రమణ వివరాల మేరకు.. గణపవరానికి చెందిన రాజేష్, ఎస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని విషయాన్ని పెద్దల దృష్టికి తెచ్చారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి బైక్ పై పాలకొల్లు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.

స్టేషన్ కి దూరంగా పట్టాల వద్ద నిల్చున్న యువతీ యువకుడు రైలు రాగానే ప‌ట్టాల‌పైకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సరిగ్గా రైలు రాగానే .. తాను చనిపోయినా తన ప్రియురాలు మాత్రం బతికి ఉండాలని భావించిన రాజేష్ ఆమెను వెనక్కి నెట్టేసి తాను మాత్రం రైలు కింద ప‌డి ప్రాణాలు విడిచాడు. ప్రియుడి మృతదేహం దగ్గర ప్రియురాలు విలపిస్తుండడం గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రేమ విఫలమైన తామిద్దరం ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని.. తన ప్రియుడు తనను పక్కకు నెట్టేసి రైలు కింద ప‌డ్డాడ‌ని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కింద పడటంతో గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News