పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ బైట పవన్ కారు ఎక్కడానికి వస్తుండటం చూసి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్‌కు నమస్కారం చేశారు. బొత్స స్పందన చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు.
ఎన్నికలు, సమావేశాల వరకే రాజకీయాలు అని బైట పార్టీలకు అతీతంగా నేతలు వ్వవహరిస్తారని మనకు తెలిసిందే. అయితే చిరంజీవితో సహా వారి ఫ్యామిలీతో బొత్స కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే పార్టీలు వేరైనా అసెంబ్లీ ప్రాంగణంలో పవన్‌ను చూడగానే బొత్స నమస్కారం చేయగా.. దానికి స్పందనగా పవన్ ఆయనకు ఎదురువెళ్లారని అక్కడి సన్నివేశాలు చూస్తే మనకు అర్థమౌతుంది.