ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ఇదే..

ఇప్పటికే ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలువురు సీనియర్లకు రెండు జాబితాల్లోనూ అవకాశం దక్కలేదు. వీరిలో జీవీఎల్ నరసింహ రావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

Advertisement
Update:2024-03-27 19:53 IST

ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. విజయవాడ వెస్ట్ స్థానం నుంచి సుజనా చౌదరికి అవకాశం ఇచ్చింది. ఇక ధర్మవరం సీటు ఆశించిన వరదాపురం సూరికి షాకిచ్చింది బీజేపీ. ఆ స్థానంలో వై.సత్యకుమార్‌కు అవకాశమిచ్చింది. తాజా లిస్టులో సీనియర్ నేత సోము వీర్రాజుకు అవకాశం దక్కలేదు. అనపర్తి నుంచి ఎన్.శివకృష్ణంరాజును బరిలో ఉంచింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం జనసేన నేత పోతిన మహేష్‌ ఆశలు పెట్టుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ తీసుకుంది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని పోటీలో నిలిపింది. దీంతో పోతిన మహేష్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

బీజేపీ అభ్యర్థులు వీళ్లే..

ఎచ్చెర్ల - ఎన్‌. ఈశ్వర రావు

విశాఖ నార్త్ - పి. విష్ణు కుమార్ రాజు

అరకు - పంగి రాజారావు

అనపర్తి - ఎన్‌. శివకృష్ణం రాజు

కైకలూరు - కామినేని శ్రీనివాస రావు

విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి

బద్వేలు - బొజ్జ రోశన్న

జమ్మలమడుగు - సి. ఆదినారాయణ రెడ్డి

ఆదోని - పి.వి. పార్థసారథి

ధర్మవరం - వై. సత్యకుమార్

దీంతో బీజేపీ తనకు కేటాయించిన మొత్తం సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇప్పటికే ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలువురు సీనియర్లకు రెండు జాబితాల్లోనూ అవకాశం దక్కలేదు. వీరిలో జీవీఎల్ నరసింహ రావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News