రాజంపేటలో టీడీపీకి షాక్.. బత్యాల గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు చెంగల్రాయుడు.

Advertisement
Update:2024-03-30 11:05 IST

తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా హైకమాండ్‌పై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. తాజాగా రాజంపేటలో టీడీపీకి షాకిచ్చారు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు.

తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు చెంగల్రాయుడు. రాజంపేట నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించారు బత్యాల. అయితే బత్యాలను పక్కనపెట్టిన చంద్రబాబు.. సుగవాసి సుబ్రహ్మణ్యంను అభ్యర్థిగా ప్రకటించారు.

తనకు టికెట్ రాకపోవడంతో పాటు సుగవాసిని అభ్యర్థిగా ప్రకటించడంతో బత్యాల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక బత్యాలకు టికెట్ రాకపోవడంతో అనుచరులు మనస్తాపం చెందారు. పెట్రోల్ పోసుకుని కొందరు ఆత్మహత్యకు యత్నించారు. తెలుగుదేశం జెండాలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News