వైసీపీ ఓటమి.. ఫస్ట్ వికెట్ డౌన్
గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే భూమన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఫస్ట్ వికెట్ పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదించాలంటూ టీటీడీ ఈవో AV ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే భూమన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
తిరుపతిలో వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తన వారసుడిగా అభినయ్ రెడ్డిని ఫస్ట్ టైం బరిలో దింపారు కరుణాకర్ రెడ్డి. అయితే తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో అభినయ్ రెడ్డి ఓడిపోయారు.
భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో చాలాకాలంగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ తొలిసారి సీఎం అయ్యాక... 2004-2006 మధ్య తిరుపతి అర్బన్ డెవలప్మెంట్(తుడా) చైర్మన్‌గా పని చేశారు భూమన. 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. మళ్లీ 2023 ఆగస్టులో ఆ పదవిని చేపట్టారు. ఇప్పుడు ఓటమి భారంతో పదవికి రాజీనామా చేశారు.