వారి ఇళ్లలో ఆడవాళ్లు జాగ్రత్త.. అఖిలప్రియ ఘాటు వ్యాఖ్యలు

ఆడపిల్లపై దాడి చేసి, చివరకు అదే ఆడపిల్లపై కేసు పెట్టి కోర్టులచుట్టూ తిప్పడం భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు అఖిల ప్రియ. ఈ రాష్ట్రంలో ఆడవారికి ఎలాంటి రక్షణ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు.

Advertisement
Update:2023-05-25 12:31 IST

నాపై కేసులు పెట్టినవారు, పెట్టించినవారు.. వారి ఇళ్లలో ఆడవారు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. తనపై కేసులు పెట్టిన, పెట్టించినవారంతా జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా ఆమె హెచ్చరించారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చిన అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలతో మరోసారి మీడియా ముందుకొస్తానన్నారు అఖిల ప్రియ. ఆధారాలతో సహా అన్నీ నిరూపిస్తానని చెప్పారు.

ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై దాడి కేసులో అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె కండిషన్ బెయిల్ పై బయటకొచ్చారు. కండిషన్ బెయిల్ కావడంతో ఆమె నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పనిమీద పోలీస్ స్టేషన్ కు వచ్చిన అఖిలప్రియ, దాడి ఘటనపై స్పందించారు. తన తప్పేమీ లేకపోయినా తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రపంచంలో ఎక్కడా ఉండదు..

ఆడపిల్లపై దాడి చేసి, చివరకు అదే ఆడపిల్లపై కేసు పెట్టి కోర్టులచుట్టూ తిప్పడం భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు అఖిల ప్రియ. ఈ రాష్ట్రంలో ఆడవారికి ఎలాంటి రక్షణ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు. ఇలాంటి సంస్కృతి ఎక్కడా వినలేదు, చూడలేదన్నారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అసలు ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో పూర్తి వివరాలతో మీడియా ముందుకొస్తానని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News