బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. రాయదుర్గంలో NIA సోదాలు
అబ్దుల్‌తో పాటు అతని కుమారుడు సోహైల్ ఖాతాల్లో భారీగా నగదు గుర్తించిన NIA అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - NIA సోదాలు కలకలం రేపాయి. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసు విచారణలో భాగంగా.. రాయదుర్గం పట్టణం ఆత్మకూర్ వీధిలో ఉంటున్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA అధికారులు సోదాలు జరిపారు. NIA సోదాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
అబ్దుల్‌తో పాటు అతని కుమారుడు సోహైల్ ఖాతాల్లో భారీగా నగదు గుర్తించిన NIA అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోహైల్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కేసు విచారణలో భాగంగా రాయదుర్గంతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తోందని సమాచారం.
ఈ ఏడాది మార్చి 1న బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఏప్రిల్ 12న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ పేలుడుకు ప్రధాన కుట్రదారు హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను NIA అరెస్టు చేసింది.