టీడీపీ, ఎల్లోమీడియా సీబీఐని రెచ్చగొడుతున్నాయా..?

సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళపైన కేసులు పెట్టి విచారణ చేసి అరెస్టుచేస్తారన్న భయంతోనే సీబీఐ ఎంట్రీని చంద్రబాబు నిషేధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడేమో సీబీఐ పనికిమాలిన సంస్థ‌.

Advertisement
Update:2023-05-24 11:10 IST

ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అంటే టీడీపీ, ఎల్లోమీడియా కూడబలుక్కునే వ్యవహరిస్తాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది కూడా అదే. వివేకానంరెడ్డి మర్డర్ కేసు విచారణలో ఎంపి అవినాష్ రెడ్డి అంటే సీబీఐ భయపడుతోందని తమ్ముళ్ళు గోల మొదలుపెట్టారు. వాళ్ళ ఆరోపణలు, గోలకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా కథనాలిస్తోంది. తమ్ముళ్ళు, ఎల్లోమీడియా గోలేమిటంటే.. సీబీఐ ఘనచరిత్రను గుర్తుచేస్తూ ప్రస్తుత దుస్థితిని ఎత్తిచూపి రెచ్చగొట్టడమే. కొమ్ములు తిరిగిన మహామహులను కూడా అరెస్టు చేసిన సీబీఐ ఇప్పుడు అవినాష్ విషయంలో ఎందుకు భయపడుతోందని అని నిలదీస్తోంది.

సీబీఐని రెచ్చగొట్టేందుకు అన్నట్లుగా గతంలో ఫ‌లానా కేసులో ఆ విధంగా వ్యవహరించింది, ఈ విధంగా దూసుకుపోయింది అంటూ ఏవేవో కథనాలు అచ్చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. సీబీఐని ఒక బఫూన్ గా చిత్రీకరిస్తూ ఇదే ఎల్లోమీడియా ఎన్నో వార్తలు, కథనాలను అచ్చేసింది. సీబీఐ అన్నది మోడీచేతిలో కీలుబొమ్మగా తయారైంది అంటూ తమ్ముళ్ళు గతంలో రెచ్చిపోయారు. ఎప్పుడంటే సీబీఐ ఎంట్రీని చంద్రబాబునాయుడు అడ్డుకుంటూ 2018, నవంబర్లో ఆదేశాలు ఇచ్చినప్పుడు.

సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళపైన కేసులు పెట్టి విచారణ చేసి అరెస్టుచేస్తారన్న భయంతోనే సీబీఐ ఎంట్రీని చంద్రబాబు నిషేధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడేమో సీబీఐ పనికిమాలిన సంస్థ‌. ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణలో అదే సీబీఐ నిప్పులాంటిది అంటూ స్తోత్రాలు చేస్తున్నారు.

తమ్ముళ్ళు తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటోంది. తాము టార్గెట్ చేసిన వాళ్ళపై సీబీఐ తప్పుడు కేసులు ఎలా పెడుతుంది..? పాలకుల చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయి విచారణలు, అరెస్టుల పేరుతో ప్రత్యర్థులను ఏ విధంగా వేధిస్తోందో అప్పట్లో కథనాలిచ్చింది. తాను అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరోలాగ మాట్లాడటం చంద్రబాబు అండ్ కోకు అలవాటే. కాకపోతే ఎల్లోమీడియా కూడా అదే పద్దతిలో వెళుతూ ఇప్పుడు ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని సీబీఐని రెచ్చగొడుతోంది. తమ్ముళ్ళు గవర్నర్ ను కలిసి సీబీఐ భయపడుతోందని రెచ్చగొట్టడం ఇందులో భాగమే. మరి సీబీఐ ఏమిచేస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News