ఎల్లో కుట్ర.. వాలంటీర్ల సమ్మె బూటకం

సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఎల్లో మీడియా దెబ్బకి సీన్ రివర్స్ అయింది. తాము సమ్మెలో లేము మహాప్రభో అంటూ వాలంటీర్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తున్నారు.

Advertisement
Update:2023-12-27 13:05 IST

"ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్ర ప్రదేశ్ గా మారిపోతోంది. నిన్న అంగన్వాడీలు నేడు పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లు... ఒక్కొక్కరూ రోడ్డెక్కుతున్నారు. ఈసారి జగన్ దిగిపోవడం గ్యారెంటీ." పచ్చ మీడియా హెడ్ లైన్స్ ఇవి. అంగన్వాడీల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది కానీ పారిశుధ్య కార్మికులు మాత్రం అక్కడక్కడా ఆందోళనకు దిగుతున్నారు. ఇక వాలంటీర్ల సమ్మె అనేది పూర్తిగా కట్టుకథ. అసలు తాము సమ్మె చేయట్లేదని అంటున్నారు వాలంటీర్ల సంఘం నేతలు. ఈనాడు సహా కొన్ని పేపర్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.

మేము సమ్మెలో లేము..

సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఎల్లో మీడియా దెబ్బకి సీన్ రివర్స్ అయింది. తాము సమ్మెలో లేము మహాప్రభో అంటూ వాలంటీర్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాల్లో కూడా వాలంటీర్లు పాల్గొంటున్నారని చెబుతున్నారు. తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, వాటిని నమ్మొద్దని అధికారులకు చెబుతున్నారు. ఇటు ప్రజలకు కూడా అదే సమాధానం చెబుతున్నారు వాలంటీర్లు.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు వాలంటీర్ సంఘాల నేతలు. ఈ వ్యవస్థ ద్వారా జరుగుతున్న మంచిని కొన్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేక తమ ఉనికికోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయన్నారు. కొన్ని పత్రికలతోపాటు, సోషల్‌ మీడియా గ్రూపుల్లో కూడా దుష్ప్రచారం చేపట్టారని విమర్శించారు. 

Tags:    
Advertisement

Similar News