లోకేష్ పాదయాత్రపై అచ్చెన్నాయుడు సంచలన ఆడియో లీక్

ఉదయమే లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఒక్కో మండలం నుంచి 50 వెహికల్స్ చొప్పున ఆరు మండలాలకు మూడు వందల వెహికల్స్‌ను ఏర్పాటు చేసి జనాన్ని తీసుకొస్తామని టీడీపీ నేత చెప్పారు.

Advertisement
Update:2023-02-09 11:33 IST

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆడియో ఇప్పుడు తీవ్ర‌ దుమారం రేపుతోంది. లోకేష్ పాదయాత్రపై అచ్చెన్నాయుడి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో నారా లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేకపోవడంపై అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోనే లోకేష్ పాదయాత్రకు స్పందన రాకపోవడంపై బాబు బాధపడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. తాను కూడా బాధపడుతున్నట్టు వివరించారు.

లోకేష్ పాదయాత్రకు జనాలను తరలించేందుకు గాను నేతలకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి పురమాయిస్తున్నారు. అందులో భాగంగానే గంగాధర నెల్లూరు నియోజకవర్గం నేతలకు ఫోన్‌లో అచ్చెన్నాయుడు సలహాలు ఇచ్చారు. అలా ఒక నాయకుడితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అచ్చెన్నాయుడితో మాట్లాడిన సదరు టీడీపీ నేత.. పక్క నియోజకవర్గాల్లో అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని.. తమ నియోజవర్గంలో మాత్రం ఆ పరిస్థితి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఉదయమే లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఒక్కో మండలం నుంచి 50 వెహికల్స్ చొప్పున ఆరు మండలాలకు మూడు వందల వెహికల్స్‌ను ఏర్పాటు చేసి జనాన్ని తీసుకొస్తామని టీడీపీ నేత చెప్పారు. 300 వాహనాలకు ఇప్పటికే డబ్బులు కూడా ఇచ్చేశానన్నారు. ప్రతి రోజూ 3వేల మంది లోకేష్ పాదయాత్ర వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఆ ఆడియో ఎవరి ద్వారా బయటకు వచ్చిందో గానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News