పోస్టల్ బ్యాలెట్.. కోర్టుకెళ్తామన్న వైసీపీ

రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అప్పటికీ ఆ నిర్ణయంలో మార్పు లేకపోతే, కోర్టుకెళ్తామని చెప్పారు.

Advertisement
Update:2024-05-30 06:38 IST

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ రగడ ఇంకా సద్దుమణగలేదు. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకంతోపాటు సీలు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందనే నిబంధన ఉంది. దేశవ్యాప్తంగా ఇదే నిబంధన ఉంటే.. ఏపీలో మాత్రం వెసులుబాటు ఇచ్చారు ప్రధాన ఎన్నికల అధికారి, సీల్ లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే వారికి అనుకూలంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై పునరాలోచించాలని ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుని ఈసీ పరిగణలోకి తీసుకునేలా లేదు. దీంతో వైసీపీ నేతలు కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకుంటామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.


గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఏపీ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ నేతలంటున్నారు. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..

రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అప్పటికీ ఆ నిర్ణయంలో మార్పు లేకపోతే, కోర్టుకెళ్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిస్తారో అదే మాదిరిగానే ఏపీలో పోస్టల్ ఓట్లు లెక్కించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

Tags:    
Advertisement

Similar News