రష్మిక డీప్ ఫేక్ వీడియో వెనుక ఏపీ వ్యక్తి? అరెస్టు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి రష్మిక వీడియోను క్రియేట్ చేసినట్లు తెలుసుకున్నారు. తాజాగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు.

Advertisement
Update:2024-01-20 16:53 IST

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట రష్మిక ఓవర్ ఎక్స్ పోజింగ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని అభిమానులు గుర్తించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో ఆ వీడియోను క్రియేట్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

రష్మిక వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు సినీ నటులు, కేంద్ర మంత్రులు ఆమెకు అండగా నిలిచారు. ఈ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతుండగానే కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్, సారా టెండూల్కర్ వంటి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో మరింత సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి రష్మిక వీడియోను క్రియేట్ చేసినట్లు తెలుసుకున్నారు. తాజాగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈ కేసులో నిందితుడిని సౌత్ ఇండియా నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతుండగా.. అరెస్ట్ అయిన వ్యక్తి ఏపీ వాసి అని ఇండియా టుడే రిపోర్టు చేసింది.

Tags:    
Advertisement

Similar News