అవి టీడీపీ తెలుగు రచయితల మహాసభలు.. డబ్బులిచ్చిన వారికే ఆహ్వానాలు
ప్రభుత్వంపై బుదర జల్లేందుకు రచయితలను, కవులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగు భాషకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో అధికార భాషా సంఘం అచేతనంగా మారినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా రచయిత సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు రచయిత మహాసభలపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు తెలుగు భాష ఆపదలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియంపైనా ప్రతికూలంగా స్పందించారు. పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో మహాసభలపై విజయబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచ తెలుగు రచయిత మహాసభల ముసుగులోరాజకీయాలు చేయవద్దని సూచించారు. డబ్బులిచ్చిన వారినే మహాసభలకు ఆహ్వానించారని ఆరోపించారు. విజయవాడలో జరిగింది టీడీపీ ప్రపంచ తెలుగు మహాసభలు అని విమర్శించారు. స్వభాషతోనే స్వాభిమానం అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించడమే వీరి ప్రధాన ఎజెండా అని విజయబాబు విమర్శించారు.
ప్రభుత్వంపై బుదర జల్లేందుకు రచయితలను, కవులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగు భాషకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో అధికార భాషా సంఘం అచేతనంగా మారినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలుగు భాష పేరుతో సమావేశం పెట్టి ఏపీలోని ప్రముఖులను కూడా ఆహ్వానించకుండా కేవలం తమకు కావాల్సిన వారిని, డబ్బులిచ్చిన వారికే ఆహ్వానించారని విజయబాబు విమర్శించారు.