కుప్పంలో ఉత్తర కుమారుడి చిందులు.. లోకేష్ పై రోజా సెటైర్లు..

కుప్పంలో చంద్రబాబు పతనం మొదలైందని, స్థానిక ఎన్నికలతోనే అది రుజువైందని అన్నారు రోజా. మూడు రోజులు తిరిగినా ఆయన వెనక వెయ్యిమంది కూడా రాలేదన్నారు. చంద్రబాబు కుప్పంకి వచ్చింది గొడవలు పెట్టి, దాడులు చేయించడానికేనని అన్నారామె.

Advertisement
Update:2022-08-31 08:19 IST

మూడేళ్లలో జగన్ సంక్షేమాన్ని తట్టుకోలేకే చంద్రబాబు కుప్పం పరిగెడుతున్నారని అన్నారు మంత్రి రోజా. ఇప్పుడు కుప్పంలో ఏదో జరిగిపోయిందంటూ లోకేష్ చిందులు తొక్కడం కామెడీగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్, కుప్పంలో ఏదో ఇరగదీస్తానంటూ వచ్చారని, జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్ కి లేదన్నారు రోజా. కుప్పంలో లోకేష్ మాటలు వింటే ఉత్తర కుమారుని ప్రగల్భాలు గుర్తొస్తున్నాయని సెటైర్లు వేశారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి రికార్డు స్థాయిలో సీట్లు గెలిచిన తమ నాయకుడిని విమర్శించడం హాస్యాస్పందం అన్నారామె.

వెయ్యిమంది కూడా లేరు..

కుప్పంలో చంద్రబాబు పతనం మొదలైందని, స్థానిక ఎన్నికలతోనే అది రుజువైందని అన్నారు రోజా. మూడు రోజులు తిరిగినా ఆయన వెనక వెయ్యిమంది కూడా రాలేదన్నారు. చంద్రబాబు కుప్పంకి వచ్చింది గొడవలు పెట్టి, దాడులు చేయించడానికేనని అన్నారామె. జగన్ పై నిందలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాడులు.. మినహా కుప్పంలో చంద్రబాబు, లోకేష్ ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పంను మున్సిపాల్టీ చేసి రెవెన్యూ డివిజన్‌ గా మార్చింది చంద్రబాబు కాదని, జగన్ అని, అక్కడి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది టీడీపీ ప్రభుత్వం కాదని, వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. అందుకే కుప్పం ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారని, జగన్ ని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

సంక్షేమాన్ని తట్టుకోలేకే..

జగన్ చేస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు రోజా. ఆ సంక్షేమ ఫలాలే తమకు స్థానిక ఎన్నికల్లో లభించాయని చెప్పారు, టీడీపీకి కుప్పం ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఎంపీపీ అశ్వినిపై దాడి చేసిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టకుండా సన్మానిస్తారా అని ప్రశ్నించారు రోజా. కుప్పం ఇంకా చంద్రబాబు అడ్డా అనుకుంటున్నారని, ఆ కాలం పోయిందని, అది జగన్ గడ్డగా మారిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అని తేలడంతో.. తండ్రీకొడుకులిద్దరూ అక్కడికి పరిగెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News