కర్నూలు మొత్తం కనబడేలా గుట్టపై హైకోర్టు - బుగ్గన

ఇక్కడి ప్రజలు, రైతులు, విద్యార్థుల ఆత్మగౌరవం నిలబెట్టేలా హైకోర్టు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. హైకోర్టు సాధించి చూట్టూ పది కిలోమీటర్ల మేర కర్నూలు పట్టణానికి మొత్తం కనిపించేలా జగన్నాథగుట్టపై హైకోర్టును నిర్మిస్తామన్నారు.

Advertisement
Update:2022-12-05 16:49 IST

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి తీరుతామని ప్రకటించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కర్నూలులో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ గర్జన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి బుగ్గన.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమో, వ్యతిరేకమో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక్కడి ప్రజలు, రైతులు, విద్యార్థుల ఆత్మగౌరవం నిలబెట్టేలా హైకోర్టు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. హైకోర్టు సాధించి చూట్టూ పది కిలోమీటర్ల మేర కర్నూలు పట్టణానికి మొత్తం కనిపించేలా జగన్నాథగుట్టపై హైకోర్టును నిర్మిస్తామన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ గర్జన నిర్వహించామన్నారు. చంద్రబాబు దృష్టితో రాయలసీమ అంటే రాళ్ల సీమ అని.. అదే తమ దృష్టిలో రత్నాల సీమ అని చెప్పారు.

అసలు రాయలసీమకు హైకోర్టు వస్తే చంద్రబాబుకు ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. గర్జన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాయలసీమ పాలిట నారాసురభూతం చంద్రబాబు అంటూ చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ నేతలు దగ్ధం చేశారు.

Tags:    
Advertisement

Similar News