కూటమి తొలి వాత.. రిజిస్ట్రేషన్ల విలువ పెంపు

2 నెలల్లోనే పెరిగిన రిజిస్ట్రేషన్ రుసుములు అమలులోకి వస్తాయి. కూటమి హయాంలో దీన్ని తొలి వడ్డనగా భావించాల్సిందే. ముందు ముందు చంద్రబాబు మార్క్ షాక్ లు మరిన్ని ఉంటాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.

Advertisement
Update:2024-08-09 06:59 IST

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి వడ్డన ఇది. ఇప్పటి వరకు పెన్షన్లు పెంచాం, ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, అన్న క్యాంటీన్లు తెరుస్తున్నాం, మెగా డీఎస్సీ.. అంటూ పాజిటివ్ వార్తలే చెప్పారు. ఇప్పుడు తొలిసారిగా రిజిస్ట్రేషన్ల విలువ పెంచుతూ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు నేతలు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇక భూముల మార్గెట్ ధరలు పెరగడమే తరువాయి.

కనిష్ఠంగా 10శాతం నుంచి గరిష్ఠంగా 20శాతం వరకు రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 15 శాతానికి ఫిక్స్ అయినట్టు సమాచారం. 2 నెలల్లోనే పెరిగిన రిజిస్ట్రేషన్ రుసుములు అమలులోకి వస్తాయి. కూటమి హయాంలో దీన్ని తొలి వడ్డనగా భావించాల్సిందే. ముందు ముందు చంద్రబాబు మార్క్ షాక్ లు మరిన్ని ఉంటాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.

వైసీపీతో పోలిక..

వైసీపీ హయాంలో 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 20శాతం, 2020లో ఎంపికచేసిన పట్టణాల్లో 10నుంచి 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని కూటమి నేతలు అంటున్నారు. 2022, 2023 లో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 20శాతం వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని చెబుతున్నారు. ఇప్పుడు తాము కూడా అదే రూల్ ఫాలో అవుతున్నామని, కొత్తగా వేసే భారం ఏదీ లేదనేది టీడీపీ కవరింగ్ డైలాగ్.

గ్రామ, వార్డు సచివాలయాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానాన్ని పూర్తిగా నిలిపివేయబోతున్నట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది. అయితే గత ప్రభుత్వం కేవలం వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్లనే సచివాలయాల్లో చేసింది. ఆ తర్వాత సాధారణ భూమి రిజిస్ట్రేషన్ల విషయంలో పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చింది. ఆ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కనపెట్టింది కూటమి ప్రభుత్వం. 

Tags:    
Advertisement

Similar News