కోర్టు రోడ్లను బాగు చేయండి- ఏపీ హైకోర్టు ఆదేశం

హైకోర్టు ఉద్యోగులు హైకోర్టులోనే పిటిషన్ వేశారు. సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందుకు స్పందించిన హైకోర్టు.. తక్షణం హైకోర్టుకు వచ్చే దారులను బాగుచేయాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
Update:2022-09-22 09:43 IST

చంద్రబాబు హయాంలో తాత్కాలిక హైకోర్టు నిర్మించారు కానీ.. అక్కడ కనీస మౌలిక సదుపాయాలను సిద్ధం చేయలేదు. సరైన రోడ్లు కూడా లేవు. హైకోర్టుకు వెళ్లే దారిలో పెద్దపెద్ద ముళ్ల పొదలు దర్శనం ఇస్తుంటాయి. దీంతో న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు చాలా ఇబ్బందిపడుతున్నారు. చీకటి పడితే ఆ దారిలో లైట్లు కూడా ఉండవు.

దీనిపై హైకోర్టు ఉద్యోగులు హైకోర్టులోనే పిటిషన్ వేశారు. సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందుకు స్పందించిన హైకోర్టు.. తక్షణం హైకోర్టుకు వచ్చే దారులను బాగుచేయాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దారి వెంబడి లైట్లు ఏర్పాటు చేయాలంది. ఇందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం కోరగా.. కోర్టు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఇచ్చింది.

హైకోర్టుకు చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు ఇతర రహదారుల్లో 2నెలల్లోగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జస్టిస్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు వచ్చే దారులను బాగు చేయాలని కోర్టు ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News