కానిస్టేబుల్ రణధీర్ కు సీఎం జగన్ సాయం..

రణధీర్ అనే కానిస్టేబుల్ ఎడమకంటికి తీవ్ర గాయం కాగా కంటిచూపు కోల్పోయారు. రణధీర్ కి సీఎం జగన్ ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement
Update:2023-08-08 19:04 IST

పుంగనూరు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు 50మంది పోలీసులు ఈ ఘటనలో గాయపడ్డారు. వారిలో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. రణధీర్ అనే కానిస్టేబుల్ ఎడమకంటికి తీవ్ర గాయం కాగా కంటిచూపు కోల్పోయారు. రణధీర్ కి సీఎం జగన్ ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఈమేరకు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

పథకం ప్రకారమే దాడి..

పుంగనూరులో జరిగిన దాడి పథకం ప్రకారమే చేశారని అన్నారు ఎస్పీ రిషాంత్ రెడ్డి. దాడి చేసి, పోలీసుల్ని గాయపరచడమే కాకుండా.. తమ పనితీరుని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారాయన. విధి నిర్వహణలో తమ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు రిషాంత్ రెడ్డి. పుంగనూరు ఘటనలో గాయపడిన ప్రతి పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విచక్షణా రహితంగా దాడి చేయడం వల్లే పోలీసులకు దెబ్బలు తగిలాయని చెప్పారు ఎస్పీ.

చంద్రబాబుని ఏ-1గా చేర్చాలి..

పుంగనూరుర ఘటనలో చంద్రబాబుని ఏ-1గా చేర్చాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పోలీసులు కాల్పులు జరపకుండా సంయమనం పాటించారని చెప్పారు. ప్రభుత్వంపై నిందలు వేయడానికి, సీఎం జగన్ పై తప్పు నెట్టేందుకే చంద్రబాబు ఈ వ్యూహ రచన చేశారని చెప్పారు నారాయణ స్వామి. మదనపల్లి నుంచి చల్లా బాబు, చంద్రబాబు ఒకే కారులో ప్రయాణిస్తూ దాడికి పథకం రచించారని ఆరోపించారు. దాడిలో గాయపడిన పోలీస్ కుటుంబాలకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు నారాయణ స్వామి. 

Tags:    
Advertisement

Similar News