కర్ణాటక పర్యటనకు పవన్‌కల్యాణ్‌.. ఎందుకంటే!

పదుల సంఖ్యలో ఏనుగులు గుంపులుగా వచ్చి ఇళ్లు, పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులు (ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఏనుగులు) అవసరం.

Advertisement
Update:2024-08-08 11:49 IST

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కర్ణాటక పర్యటనకు వెళ్లారు. క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరులో ఆయన పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక కార్యక్రమాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పవన్‌కల్యాణ్‌కు ఇదే తొలి పర్యటన.

ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో పవన్‌కల్యాణ్‌ భేటీ కానున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లాతో పాటు పార్వతీపురం ప్రాంతంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో ఏనుగులు గుంపులుగా వచ్చి ఇళ్లు, పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులు (ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఏనుగులు) అవసరం.

ప్రస్తుతం కర్ణాటక దగ్గర కుంకీ ఏనుగులు ఉండడంతో ఈ అంశంపై చర్చించనున్నారు పవన్‌కల్యాణ్. ఏపీకి కుంకీ ఏనుగులు ఇవ్వాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరనున్నారు. పవన్‌ పంచాయతీ రాజ్‌ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌ అండ్‌ రూరల్‌ వాటర్ సప్లై శాఖతో పాటు అటవీ శాఖ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News