ఏపీ అసెంబ్లీ చివరి రోజు.. సభ ముందు రెండు కీలక బిల్లులు

ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు చర్చిస్తారు.

Advertisement
Update:2023-09-27 06:00 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. టీడీపీ నిరసనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విజిల్స్, అరుపులు, కేకలతో.. రెండు రోజులు సమావేశాలు వాడివేడిగా సాగాయి, ఆ తర్వాత ప్రతిపక్షం లేని సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగాయి. ఈ రోజు ఆఖరు రోజు. సభలో ఈ రోజు రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతోంది ప్రభుత్వం. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది.

ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు చర్చిస్తారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు-2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు-2023లను సభలో ప్రవేశ పెడతారు. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్-2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో ఈరోజు తీర్మానం ప్రవేశపెడతారు.

మండలిలో చివరి రోజు..

ఈ రోజు శాసన మండలి సమావేశాలు కూడా ఆఖరు. ఉదయం పది గంటలకు మండలి ప్రారంభం అవుతుంది. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం, మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంపై మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగుతుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు జరుగుతాయి. 

Tags:    
Advertisement

Similar News