అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అన్న అంబటి

బాలయ్య మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే రా, ఇటువైపు రా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.

Advertisement
Update:2023-09-21 09:52 IST

ఏపీ అసెంబ్లీలో అనుకున్నంతా అయింది. తొలిరోజే అసెంబ్లీలో రచ్చ చేశారు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా టీడీపీ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరేశారు.


Full View

మీసం తిప్పిన బాలయ్య..

అధికార పార్టీ సభ్యులను చూస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పడంతో మరింత గందరగోళం నెలకొంది. బాలయ్య మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే రా, ఇటువైపు రా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. "అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, రెచ్చగొడుతున్నారు, ఇది సరైన విధానం కాదు" అని అన్నారు అంబటి. మీసం తిప్పడం, తొడగొట్టడం లాంటివన్నీ సినిమాల్లో చూపించుకోవాలన్నారు అంబటి. మా సభ్యులు రెచ్చిపోతే జరిగే అవాంఛనీయ సంఘటనలకు ప్రతిపక్ష సభ్యులే బాధ్యత వహించాలన్నారాయన.

టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై దాడికి దిగాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి స్పీకర్ ని కోరారు. చంద్రబాబుపై గౌరవం ఉంటే న్యాయస్థానాలకు వెళ్లి తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి గొడవ చేస్తే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్నారు. ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పారు అంబటి. గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. 

Tags:    
Advertisement

Similar News